Sanganabhatla Narasaiah’s biography, net worth, fact, career, awards and life story

Intro Telugu stage actor
Is Actor 
From India 
Type Film, TV, Stage & Radio 
Gender male
Birth 23 July 1954
Age: 66 years

సంగనభట్ల నర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రంగస్థల నటులు, దర్శకులు మరియు రంగస్థల అధ్యాపకులు.

జననం

సంగనభట్ల నర్సయ్య 1954, జూలై 23న కరీంనగర్ జిల్లా, ధర్మపురి లో జన్మించారు.

విద్యాభ్యాసం- ఉద్యోగం

తెలుగు, సంస్కృతంలో ఎం.ఏ., ఎం.ఓ.ఎల్., లింగ్విస్టిక్స్ డిప్లోమా, పిహెచ్.డి. చేశారు. 37 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలో ప్రిన్సిపాల్ గా 28 సంవత్సరాలు పనిచేసి, 2010, డిసెంబరు 31న పదవీ విరమణ పొందారు.

రచనలు

  1. తెలుగులో దేశిచ్ఛందస్సు (ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా కొరకు సమర్పించబడింది)
  2. ధర్మపురి క్షేత్ర చరిత్ర
  3. చాటు కవిత్వం
  4. తెలివాహ గోదావరి

వంటి 14 గ్రంథాలు

రంగస్థల ప్రస్థానం

12 ఏళ్ల వయసులో 1966 డిసెంబరులో సోనేకీ వర్షా అనే హిందీ నాటకంలోని అజుని పాత్ర ద్వారా రంగస్ధలంపై అడుగుపెట్టారు. 14 ఏళ్ల వయసులో 1968 ఆగస్టు 15న కన్యాశుల్కం నాటకంలోని గిరీశం ఏకాపాత్రాభినయం పాత్ర ద్వారా తెలుగు రంగస్ధలంపై అడుగుపెట్టారు.

నటించిన నాటకాలు

గయోపాఖ్యానం, పాండవోద్యోగం, సోనేకి వర్ష్, భువన విజయం, వీరపాండ్య కట్టబ్రాహ్మణ, నాగమనాయుడు, వీరకాపయ, వేములవాడ మహత్యం, మనిషి మనసు, ఎడ్రస్ లేని మనుషులు, కన్యాశుల్కం, సుందరకాండ, కొత్తచిగురు, రేపేంది ?, వందనోటు, నరకంలో లంచం, అంతర్వాణి, నీతులు గోతులు, మిస్టర్ వైజాగ్, ఇచ్చట సన్మానములు చేయబడును మొదలైన నాటకాలలో నటించారు.

దర్శకత్వం వహించిన నాటకాలు

వీరపాండ్య కట్టబ్రాహ్మణ, గయోపాఖ్యానం, రేపేంది ? మొదలైనవి.

బహుమతులు

గయోపాఖ్యానం, వీరపాండ్య కట్టబ్రాహ్మణ నాటకాలకు వివిధ సందర్భాల్లో బహుమతులు అందుకున్నారు.

పురస్కారాలు

  1. బి.ఎన్. శాస్త్రి స్మారక చరిత్రక పరిశోధన పురస్కారం
  2. గ్రామీణ కళాజ్యోతి అవార్డు (నాటకరంగ సేవకు)
  3. సరస పద్య గాయక అవార్డు (వరంగల్)
  4. అబ్బూరి స్మారక అవార్డు (తెలుగు విశ్వవిద్యాలయం)
  5. పర్యావర ప్రదూషణ సంరక్షణ పురస్కారం (గోదావరిఖని)

మూలాలు

You May Also Like

James Read’s net worth, biography, fact, career, awards and life story

James Read net worth: James Read is an American actor who has a net worth of $1 million. James Read was born in Buffalo, New York in July 1953. From 1982 to 1983 he starred as Murphy Michaels on the television series Remington Steele. Read starred as George Hazard on the TV mini-series North and South, Book I in 1985 and North and South, Book II in 1986. From 2005 to 2008 he starred as Ken Davis on the TV series Wildfire. James Read began starring as Clyde Weston on the soap opera Days of Our Lives in 2014. He has also had recurring roles on the TV series General Hospital, Persons Unknown, Charmed, and American Dreams. James Read has also appeared in films including The Initiation, Eight Men Out, Beaches, Legally Blonde, Not Another Teen Movie, Legally Blonde 2: Red, White & Blonde, and more. He married Wendy Kilbourne in 1988.
Read More