Aripirala Viswam’s biography, net worth, fact, career, awards and life story

Intro poet, writer
Is Writer 
From India 
Type Literature 
Gender male

అరిపిరాల విశ్వం ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మిక గురువు. ఆయన “ఆనందఘన”గా సుప్రసిద్ధులు. ఆయన హైదరాబాద్‌ న్యూసైన్సు కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చాలాకాలం పనిచేశాడు. దేవుడిని నమ్మే మార్క్సిస్టుగా తనను తాను వర్ణించుకున్నాడు.

జీవిత విశేషాలు

ఆయన కృష్ణా జిల్లా నడకుదురు(చల్లపల్లి) గ్రామంలో ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి లక్ష్మీనారాయణ శాస్త్రి. ఆయన పూర్వీకులు బెనారస్ నుండి వచ్చిన వైదిక గురువులుగా సుప్రసిద్ధులు. ఆ వంశవృక్షంలో ఆయనకు పూర్వం 33 తరాలవరకు వైదిక ధర్మపరులైన పూర్వీకులుండేవారు. అనేక మంది పీఠాధిపతులు మరియు ఆధ్యాత్మిక గురువులు మరియు మైసూరు రాయల్టీ, శృంగేరీ పీఠం ఆస్థాన విద్వాంసులు సైతం విశ్వంగారి తండ్రిగారైన లక్ష్మీనారాయణ శాస్త్రిని కలసేవారు. ఆయనకు సాధారణంగా అలిపిరాల విశ్వం జన్మించినప్పటికీ ఆయన పూర్వజన్మకు సంబంధించిన ఆధ్యాత్మిక సంపద, పరమగురు మహావతార్ బాబాజీ ఆయనను ఒక యోగిగా గుర్తించినట్లు అవగతమైనది.

ఆ బాలుడు పెరిగి పెద్దవాడైన తర్వాత పద్యం, ధారణ, కళలు మరియు వాక్పటిమల పట్ల విశేష ప్రతిభ కనబరిచాడు. ఆయన న్యూయార్క్ నందలి ప్రపంచ పొయిట్రిక్ సొసైటీ నుండి అవార్డును అందుకున్నారు. ఆయన చిన్నవయసులోనే యునైటెడ్ నేషన్స్ మైస్టిక్ గ్రూపులో ప్రసంగించి తన ప్రతిభను ప్రపంచానికి చాటాడు. ఆయన భూగ్రహంపై గల 2000 మంది ప్రతిభావంతులైన పౌరులలో ఒకనిగా గుర్తింపబడ్డాడు. ఆయన తన స్వంత రాష్ట్రంలో డాక్టరేట్ పొందడమే కాకుండా ప్రపంచంలోని వివిధ విశ్వవిద్యాలయాలనుండి తొమ్మిది డాక్టరేట్లతో సత్కరింపబడ్డాడు. ఆయన సాహిత్య అకాడమీ అవార్డును కూడా పొందారు. తన స్వంత రాష్ట్రమే కాకుండా 137 దేశాలలో సుపరిచిత వ్యక్తిగా నిలిచాడు. ఆయన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనడమే కాకుండా వివిధ సంస్థలలో సభ్యునిగా, డైరక్టరుగా, చైర్మన్ గా అనేక సేవలనందించారు.విశ్వం గారు చేసిన ప్రసంగాలను 10000 ఆడియో సిడి ల యందు రికార్డ్ చెసారు. ఆయన రెండవ కుమారుడు అరిపిరాల రామకృష్ణ గారు వారి తండ్రిగారు చేసిన ప్రసంగాలను పుస్తకాలు రూపములో ప్రజలకు అందుబాటు లోకి తెస్తున్నారు. అరిపిరాల విశ్వం గారు కొంతకాలం తర్వాత ప్రజా జీవితం నుండి అదృశ్యమై (2010) లో తన గురువు అయిన మహావతార్ బాబాజీ గారి ఆజ్ఞ మేరకు ప్రజాజీవితంతో స్వీయ బహిష్కరణ విధించుకున్నారు. ఆయనకు వారి గురువుగారైన మహావతార్ బాబాజీ ఆనందఘన అన్న నామాన్ని విశ్వం గారికి ఇచ్చారు. ఆయన రాసిన బుక్స్ అన్నీ కూడా ఆనందఘన Dr అరిపిరాల విశ్వం అన్న పేరు మీద ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు (దాదాపు 400 ) లలిత పరమేశ్వరి మరియు గురువు గారైన మహావతార్ బాబాజీ కృపతో రాశారు. ఇలాంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథాలు ఇంత లోతైన జ్ఞానం తో రాయడం మామూలు మానవుడివల్ల వీలుకాదనియు ఇతను కారణజన్ముడని మనకు అర్ధమౌతున్ది. ఈయన గడిపిన జీవితం కూడా ఎంతో సామాన్యం గ గడిపారు. క్రియ యోగం లో ఆనందఘన (విశ్వం) గారు గొప్ప నిష్ణాతుడు. అయన దగ్గర ఎంతో మంది శిష్యులు క్రియ యోగ నేర్చుకున్నారు.ఈయన రాసిన బుక్స్ లోసాధన పంచతంత్రం మరియు ఖడ్గమాలా దర్శనము (ఇంత వివరణ ఎవరూ రాసిన దాఖలా లేదు) చదివితే లలిత అమ్మవారి అనుగ్రహం ఈయన మీద ఎంత వున్నదో మనకు అవగతమౌతున్ది. ఆయన “పరంపర విశ్వంభర” అనే సంస్థను స్థాపించి అనేక ఆధ్యాత్మిక విషయాలను ప్రబోధించడమే కాకుండా వివిధ యోగాలను సాధకులకు నేర్పించేవారు.ఆయన తోటి జీవుల యొక్క ఆధ్యాత్మిక అభ్యున్నతికి అంకితం ఒక ట్రస్ట్ ప్రారంభించారు.

రచనలు

  1. విదురకన్నెలు
  2. కాలం గీస్తున్న గీతలు
  3. రేపటి స్వర్గం
  4. మైథిలీవల్లభ శతకం
  5. పృథ్వీశ్వర త్రిశతి
  6. మనస్
  7. గుహేశ్వర మహాదేవ వచనములు
  8. ఖడ్గమాలా దర్శనము (ఆనందఘన వ్యాఖ్య)
  9. పరావిద్య
  10. సాధనా పంచతంత్రం (ఉపన్యాసాలు)
  11. శ్రీగురు త్రయోపనిషత్
  12. శ్రీ విద్యాపంచదశి
  13. ఉపనిషత్తుల శ్రీ విద్యారహస్యాలు
  14. పరంపరా ఉపనిషత్ కథలు
  15. ప్రణవ సాహస్రి
  16. హళేబీడు
  17. ధ్యానదీపిక
  18. కల చెరిగిపోనీకు నేస్తం
  19. అశ్వఘోషుడు (నాటకం)
  20. శ్రీలలితా సహస్రనామ అంతర్గత రహస్యములు
  21. మంత్రఘన
  22. ఖడ్గమాలా దర్శనము
  23. Voice of OM silence
  24. Gospel of Silence
  25. K.Seshagiri Rao (monograph)
  26. Avadhuta Gita
  27. Guru Geeta
  28. Kriya yoga – The essence of Satha vidyas
  29. Babaji Stories
  30. Fistful of Memory
  31. Crisis of Self
  32. River My Guru
  33. Subrahmanya Swamy
  34. Sri Sutram
  35. Messaiah 2-volumes
  36. Jiddu Krishna Murti
  37. The spirit, God and Foreverness

రచనల నుండి మచ్చుతునకలు

పౌనఃపున్యజనుర్మృతీ కలిత సంప్రాప్తోగ్ర బాధామతిన్
ఏనః పుంజము నెంత దాల్చితినొ పోయెన్ ఱేయిచీకట్లలో
లీనంబై బ్రతుకంత నీకెదురు రాలేనోయి! నే నంధుడన్
శ్రీ నిత్యోత్సవ చిద్విలాస పరమేష్టీ మైథిలీ వల్లభా!
అస్మజ్జీవన గేహళీజ్వలిత దీపాంకూరముల్ దైన్య సం
విస్మర్తవ్య కథాప్రపంచమును లేపెన్ నిద్రలోనుండి – మై
భస్మోల్లేపన పాండు దీధితులు పర్వన్ నందిపై వచ్చు నీ
శా! స్మృత్యంకములో సత్యమ్ము నిలుమయ్యా! మైథిలీ వల్లభా!

(మైథిలీ వల్లభ శతకము నుండి)
పూవుం దోటలు నీలి మబ్బులు మహాంభోరాశి నిర్ఘోషముల్
తావుల్ చిమ్మెడి దక్షిణానిలము – చెంతన్ చెట్లపై పక్షులున్
నీవున్నిల్తురు – యీ స్మశానభువిలో – నిర్ణిద్ర ప్రేతాకృతుల్
ఏవో మంత్రములుచ్చరింపఁగ – విషాహిగ్రీవ! పృథ్వీశ్వరా!
ఇవె పొన్నల్ ప్రభుపాద పూజకయి – ఎన్నేండ్లిట్లుగా నిల్చెనో
ఇవె బిల్వద్రుమసంతనిల్ – చిగురుటాకే కన్నుగా బొల్చు ని
య్యవి మల్లీ వకుళామ్ర భూజములు! పర్యాప్తాశ్రుమాలా – సుమా
లివి లేమబ్బులు కుంభశీర్షములు – వ్రాలెన్ మ్రోల పృథ్వీశ్వరా!

(పృథ్వీశ్వర త్రిశతి నుండి)

ఆయన ప్రేరణతో సేవలందిస్తున్న సంస్థలు

మూలాలు

ఇతర లింకులు

  • జెన్ పబ్లికేషన్స్ లో ఆయన గూర్చి వ్యాసం
  • ఆయన రచనలు
  • “world cat identities of aripirala viswam”.
You May Also Like

Chris Janson’s net worth, biography, fact, career, awards and life story

Chris Janson net worth: Chris Janson is an American country music singer and songwriter who has a net worth of $6 million. Chris Janson was born in Perryville, Missouri in April 1986. He released his debut studio album Buy Me a Boat on Warner Bros. Records in 2015 and the album reached #4 on the US Country chart and #18 on the Billboard 200 chart. Janson released the album Everybody in 2017 which reached #7 on the US Country chart and #53 on the Billboard 200 chart. His single “Buy Me a Boat” reached #2 on the US Country and Canadian Country charts and #3 on the US Country Airplay chart as well as being certified 2x Platinum. His single “Fix a Drink” reached #2 on the US Country Airplay chart and #4 on the Canadian Country chart. As a songwriter he has co-written singles for artists including Tim McGraw, Randy Houser, and LoCash.
Read More